వాల్మీకీ నుంచి పూజా త‌ప్పుకుంటుందా?

Pooja Hegde no to to do Valmiki?
Monday, May 13, 2019 - 22:30

పూజా హెగ్డేకి ఈ రోజు ఇంత క్రేజ్ రావ‌డానికి కార‌ణం హ‌రీష్‌ శంక‌ర్‌. తెలుగులో విజ‌యాలు లేక బాలీవుడ్‌కి వెళ్లిన పూజని దువ్వాడ జ‌గ‌న్నాథం సినిమాలో హీరోయిన్‌గా తీసుకొని ఆమెని పాపుల‌ర్ చేశాడు. ఆ త‌ర్వాత రంగ‌స్థ‌లం, అర‌వింద స‌మేత‌, మ‌హ‌ర్సి ..ఇలా ప‌లు బ‌డా సినిమాల్లో క‌నిపించింది. ప్ర‌స్తుతం బ‌న్ని, ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టిస్తోంది.  ఐతే ఈ భామ‌ని ఒక కీల‌క పాత్ర‌లో తీసుకోవాల‌నుకున్నాడు హ‌రీష్ శంక‌ర్‌.

ఆయ‌న ఇపుడు తీస్తున్న వాల్మీకీ చిత్రంలో ఆమెకి భారీ పారితోషికం ఇచ్చి న‌టింప‌చేయాల‌నుకున్నాడు. మొద‌ట పూజా హెగ్డే ఒప్పుకొంది. ఐతే పారితోషికం విష‌యంలోఓవ‌ర్‌గా రూమ‌ర్స్ రావ‌డంతో ఆమె ఇపుడు చేయ‌న‌ని మొండికేస్తోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పూజాహెగ్డే వాల్మీకీ సినిమాలో ఉంటుందా లేదా అనేది ఇపుడు చెప్ప‌లేం.