ప్రభాస్ నన్ను మార్చేశాడు: పూజ

Pooja Hegde: Prabhas changed my perception about script choices
Wednesday, January 22, 2020 - 14:30

ప్రభాస్ ఛరిస్మాకి ఎందరో హీరోయిన్లు పడిపోయారు. ఆయన మాటలకి పడిపోయాను అంటోంది పూజా హెగ్డే. ఓ సందర్భంలో ప్రభాస్ తనను బాగా ప్రభావితం చేశాడని చెప్పుకొచ్చింది.

"ఇప్పుడు మీరో స్టార్‌. జయాపజయాలకు అతీతంగా టాప్‌ యాక్టర్‌గా కొనసాగుతున్నారు. మిమ్మల్ని చూడటానికే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు" అని ప్రభాస్ ఓ సందర్భంలో పూజా హెగ్డేతో అన్నాడట. ఆ మాటలు తనను బాగా ప్రభావితం చేశాయని, తన ఆలోచన విధానాన్ని మార్చేశాయని అంటోంది పూజాహెగ్డే.

ఇకపై ప్రభాస్ మాటల్ని దృష్టిలో పెట్టుకొని పాత్రలు ఎంపిక చేసుకుంటానని, మరింత బాధ్యతాయుతంగా ఉంటానని అంటోంది. తన డ్రీమ్ రోల్స్ గురించి మాట్లాడుతూ.. తనకు చిన్నప్పట్నుంచి హ్యారీ పోటర్ సినిమాలంటే చాలా ఇష్టమట. అవకాశం దొరికితే పిల్లల కోసం అలాంటి మేజిక్ సినిమా ఒకటి చేయాలని ఉందంటూ తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి బయటపెట్టింది పూజా హెగ్డే. 

పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్ కొత్త సినిమాలో నటిస్తోంది.