ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటావా పూజా?

Pooja Hegde receives embarrassing question from Prabhas fan
Friday, April 3, 2020 - 18:00

"ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటావా పూజా?"

క్రేజీ హీరోయిన్ ఆన్ లైన్ లో దొరికితే అభిమానులు ఊరుకుంటారా? ఒకప్పుడు ఏదైనా ఓపెనింగ్ కు సంబంధించి బయట కనిపిస్తే నలిపేసేవారు. ఇప్పుడు ఇంటర్నెట్ లో కనిపించినా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తాజాగా పూజా హెగ్డేకు ఆ బాధ ఏంటే తెలిసింది. ఓ అభిమాని నేరుగా ప్రభాస్ ను నువ్వు పెళ్లి చేసుకుంటావా అని ప్రశ్నించేసరికి పూజా హెగ్డే షాక్ అయింది. లైవ్ లో బాగుండదు కాబట్టి కాస్త సర్దుకొని చిన్న నవ్వు నవ్వేసి తమాయించుకుంది.

లాక్ డౌన్ టైమ్ కాబట్టి ప్రస్తుతం ఇంటికే పరిమితమైంది పూజా హెగ్డే. ఆమెను ఓ బాలీవుడ్ వెబ్ సైట్ ఆన్ లైన్లోకి తీసుకొచ్చింది. అభిమానులు ఎవరైనా ప్రశ్నలు అడగొచ్చని ఊరించింది. ఎక్కువగా సౌత్ జనాలే అందులో ప్రశ్నలు సంధించారు. మరీ ముఖ్యంగా ప్రభాస్ పై ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి. వాటికి పూజా కూడా ఓపిగ్గా సమాధానం చెప్పింది. ప్రభాస్ అంత డౌన్ టు  ఎర్త్ పర్సన్ ను ఎక్కడా చూడలేదని చెప్పుకొచ్చింది.

తన దృష్టిలో సల్మాన్ ను హానెస్ట్ పర్సన్ అని, హృతిక్ ను డూడ్ అని, బన్నీని వెరీ వెరీ స్పెషల్ అని సింపుల్ వర్డ్స్ తో చెప్పిన పూజా.. ప్రభాస్ ను మాత్రం మస్తీ అనే పదంతో పోల్చింది. ప్రభాస్ పక్కనుంటే డల్ నెస్ అనేది ఉండదని, ఫుల్ మస్తీ ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇలా వరుసగా ప్రభాస్ పై స్పందించేసరికి ఓ అభిమాని అతడ్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగేశాడు. దీంతో పూజా హెగ్డే కాస్త అసహనంతో కూడిన నవ్వుతో ఆ ప్రశ్నను స్కిప్ చేసింది.