రష్మిక స్థానంలో పూజాహెగ్డే

Pooja Hegde replaces Rashmika Mandanna
Wednesday, February 26, 2020 - 22:15

ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మిక, పూజా హెగ్డే మధ్య మంచి కాంపిటేషన్ నడుస్తోంది. పెద్ద సినిమాలన్నీ వీళ్ల చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ఒకర్నొకరు రీప్లేస్ చేసుకోవడం కూడా మొదలైంది. ఇందులో భాగంగా రష్మిక చెంతకు వచ్చిన ఓ అవకాశాన్ని పూజా హెగ్డే ఎగరేసుకుపోయింది.

నాగచైతన్య హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రానున్న ఈ సినిమాలో రష్మికను హీరోయిన్ గా అనుకున్నారు. అయితే ఇప్పుడామె స్థానంలో పూజా హెగ్డే వచ్చి చేరింది. దాదాపు ఇది ఫిక్స్

నిజానికి అటు దర్శకుడు, ఇటు హీరోకు పూజా హెగ్డే కలిసొచ్చే ఎలిమెంట్ కాదు. గతంలో పూజాతో కలిసి ఓ ఫ్లాప్ ఇచ్చాడు నాగచైతన్య. ఇక పరశురామ్ అయితే గీతగోవిందం సినిమా కారణంగా రష్మికను మాత్రమే సెంటిమెంట్ ఫీల్ అవుతున్నాడు. కానీ 14రీల్స్ ప్లస్ నిర్మాతలు మాత్రం పూజాకే ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

ఈ బ్యానర్ పై వచ్చిన గద్దలకొండ గణేశ్ సినిమాలో పూజా హెగ్డే నటించింది. ఆ సినిమా హిట్టయింది. దీంతో పూజాను లక్కీ ఛార్మ్ గా ఫీల్ అవుతున్నారు నిర్మాతలు. అందుకే ఆమెను మరోసారి రిపీట్ చేయాలనుకుంటున్నారు. అలా రష్మిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.