యువరాణిగా మారిన బుట్టబొమ్మ

Pooja Hegde turns princess
Sunday, March 1, 2020 - 22:30

పూజా హెగ్డేను అందంగా చూపించడానికి ఒక్కో దర్శకుడు ఒక్కో విధంగా కృషి చేస్తున్నాడు. తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ ఈ అమ్మాయిని బుట్టబొమ్మగా ప్రజెంట్ చేశాడు. ఇప్పుడు అంతకంటే అందంగా పూజాను చూపించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. అవును.. ప్రభాస్ సినిమాలో పూజా హెగ్డే నెవెర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫర్ క్యారెక్టర్ లో కనిపించనుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో పూజా హెగ్డే యువరాణిగా కనిపించబోతోంది.

వింటేజ్ యూరోప్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే ఓ దేశానికి ప్రిన్సెస్ గా కనిపించబోతోంది. మూవీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఆమె ఈ లుక్ లో మోస్ట్ గ్లామరస్ గా కనిపిస్తోందట. ఈ మేరకు హైదరాబాద్ శివార్లలో వేసిన ఓ సెట్ లో షూటింగ్ జరుగుతోంది.

యువరాణి పాత్రల్లో కనిపించిన హీరోయిన్లు కొంతమంది ఉన్నారు. కానీ విదేశీ యువరాణిగా, అది కూడా వంద ఏళ్ల కిందటి విదేశీ సామ్రాజ్యానికి ప్రిన్సెస్ గా కనిపించిన అదృష్టం మాత్రం పూజా హెగ్డేకే దక్కింది. ఈ సినిమాలో పూజా గెటప్, ఆమె గ్లామర్ నెవెర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్ అంటున్నారు సినీజనాలు.

మూవీలో ప్రభాస్-పూజా హెగ్డే కు సంబంధించిన ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్ గా ఉంటుందని.. సినిమా ఓ విజువల్ ఫీస్ట్ లా ఉండబోతోందని ఊరిస్తున్నారు. ఈ ఏడాదిలోనే రాబోతోంది ప్రభాస్-పూజా హెగ్డే మూవీ. ఈ సినిమాకు రాథే శ్యామ్ లేదా ఓ డియర్ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు.