పోగుట్టుకున్న చోటే పూజకి జాక్ పాట్

Pooja Hegde's career is shining
Monday, March 9, 2020 - 11:30

పూజా హెగ్డేకు సంబంధించి గమ్మత్తైన విషయం ఇది. కెరీర్ స్టార్టింగ్ లో కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని చిత్ర పరిశ్రమల్లో ఫ్లాపులు చూసింది. తర్వాత రీఎంట్రీ లో ఒక రేంజ్ లో మెరిసింది. ఎక్కడైతే ఫ్లాపులిచ్చిందో అక్కడే క్రేజీ హీరోయిన్ అనిపించుకుంటోంది.

కోలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసింది పూజా హగ్డే. ఆమె చేసిన ముగమూడి అనే సినిమా ఫ్లాప్ అయింది. తర్వాత తెలుగులో "ఒక లైలా కోసం" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇది కూడా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత బాలీవుడ్ లో "మొహాంజదారో" అనే సినిమా చేసింది. అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది.

ఇలా 3 భాషల్లో 3 ఫ్లాపులు ఇచ్చిన తర్వాత, అదే భాషల్లో తిరిగి పాపులర్ అవ్వడం ప్రారంభించింది. తెలుగులో డీజే నుంచి పూజా హెగ్డే దశ తిరిగింది. అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో ఇలా వరుసగా బడా సినిమాలు చేసి టాప్ రేంజ్  కి వెళ్ళింది. ఇక బాలీవుడ్ లో కూడా హౌజ్ ఫుల్ 4తో హిట్ కొట్టింది.

ఇక పూజాకు మిగిలింది కోలీవుడ్ మాత్రమే. ఇప్పుడు దానిపై కూడా ఫోకస్ పెట్టింది ఈ బ్యూటీ. విజయ్ హీరోగా రాబోతున్న ఓ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. తమిళ్ లో కూడా హిట్ పడితే.. 3 భాషల్లో క్లిక్ అయిన హీరోగా నిలిచిపోతుంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెదుక్కోవడం అంటే ఇదేనేమో.