పూజ ఫస్ట్ ఛాయస్ ఎవరికి?

Pooja Hegde's first choice
Thursday, May 28, 2020 - 00:45

షూటింగులు స్టార్ట్ కాబోతున్నాయి. జూన్ మొదటి వారమో, ఆ తర్వాతో... మొత్తానికి రీ ఓపెనింగ్ కి ఇండస్ట్రీ రెడీ అవుతోంది. అన్నపూర్ణ స్టూడియోలో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు చర్చోపచర్చలు చేస్తున్నారు. ముందో, వెనకో ... ప్రభాస్, అఖిల్ సినిమాలు కూడా షురూ అవుతాయి. మరి ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ పూజా హెగ్డే నే. 

రెండూ ఒకేసారి తిరిగి స్టార్ట్ కాలేవు. పూజ హెగ్డే డేట్స్ ని బట్టి ఈ రెండు సినిమాలు ప్లాన్ చేసుకోవాలి. మరి ముందు అఖిల్ కి డేట్స్ ఇస్తుందా? ప్రభాస్ కా? ఏది ముందు స్టార్ట్ అవుతుంది... అందులో హీరోయిన్ పోర్షన్ షూటింగ్ ఏది ముందు అన్నది డిసైడ్ ఐతే దాన్ని బట్టి తన డేట్స్ ఇస్తుంది అంట. హీరోకి కాదు సినిమా అవసరాన్ని బట్టి తన కాల్షీట్లు ఉంటాయని చెప్తోంది. 

పూజ హెగ్డే బాలీవుడ్ లో కూడా సల్మాన్ ఖాన్ సినిమా ఒప్పుకొంది. కానీ ఫస్ట్ ఛాయస్ మాత్రం టాలీవుడ్ కే.