ఆమె కాళ్ళ కోసం సీన్లే మార్చేసాడట

Pooja Hegde's Samajavaragamana back story
Monday, January 20, 2020 - 18:45

సినిమా డైలాగులు కాస్త అతిగా ఉంటే.. ఎవరీ రచయిత ప్రాసల కోసం పాకులాడినట్టున్నాడు అంటుంటారు. కానీ అల వైకుంఠపురములో సినిమా కోసం త్రివిక్రమ్ కాళ్ల కోసం పాకులాడినట్టు అనిపిస్తుంది. సూపర్ హిట్ అయిన సామజవరగమన.. పాట కోసమే దర్శక-రచయిత త్రివిక్రమ్ హీరోయిన్ కాళ్లపై సీన్ తీసినట్టు తెలుస్తోంది. నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి.. అంటూ సాగే పల్లవి కోసం ఏకంగా హీరోయిన్ ఎంట్రీ సీన్ నే మార్చేసుకున్నారట.

ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ కాస్తయినా ఇబ్బంది పడ్డారు అంటే అది ఒక్క హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ లోనే. హీరోయిన్ పొట్టి గౌను, కోటు వేసుకుని లిఫ్ట్ లోకి ఎంట్రీ ఇస్తుంటే.. మన హీరో చూపులన్నీ ఆమె తొడలపైనే ఉంటాయి. ఆ తర్వాత కూడా కాసేపు ఆ చూపుల సీన్ కంటిన్యూ అవుతుంది. హీరో హీరోయిన్ కాళ్లను అలా ఆరాధిస్తున్నాడంటూ ఆడియన్స్ అర్థం చేసుకున్నాక హీరో సామజవరగమన పాట అందుకుంటాడు.

ఆ పాట లిరిక్స్ ని జస్టిఫై చేసేందుకే హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ మార్చేశాడట త్రివిక్రమ్. అప్పటికే పూజా హెగ్డే పరిచయ సన్నివేశం పూర్తయినా.. పాట సూపర్ హిట్ కావడంతో దాన్ని మార్చక తప్పలేదు, హీరోని కాళ్ల ఆరాధకుడిగా చిత్రీకరించక తప్పలేదు. మొత్తమ్మీద ఆ కాసేపు హీరో కాళ్ల ఫోబియా వచ్చినట్టు, చూపుల్ని అక్కడే లాక్ చేసుకుని ఉండిపోతాడు.

అది మినహా సినిమా అంతా క్లీన్ గా ఉందనడంలో రెండో మాటే లేదు. మొత్తమ్మీద త్రివిక్రమ్ కూడా ఇలా ఓ పాట కోసం... సన్నివేశాన్ని చిత్రీకరించడానికి కాళ్ల దగ్గరే ఆగిపోయాడన్నమాట.