భార్య బికినీ ఫొటో షేర్ చేసిన భర్త

Pooja Ramachandran's husband shares her bikini pic
Thursday, April 16, 2020 - 18:30

పూజా రామచంద్రన్.. ఈ ఫేస్ కు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళ భాషల్లో ఈమెకు అంతోఇంతో పాపులారిటీ ఉంది. బిగ్ బాస్ తర్వాత ఈమెకు మరింత క్రేజ్ వచ్చింది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు పెడుతూ ఆ క్రేజ్ ను అలానే కొనసాగిస్తోంది ఈ చిన్నది.

గతేడాది జాన్ కొక్కిన్ అనే మోడల్ ను పెళ్లాడింది పూజా రామచంద్రన్. నిన్నటితో వీళ్లు పెళ్లి చేసుకొని ఏడాది అయింది. ఈ సందర్భంగా తన భార్య బికినీలో ఉన్న ఫొటోను షేర్ చేశాడు జాన్. ఇప్పుడంతా లాక్ డౌన్ నడుస్తోంది కానీ, ఏడాదిగా తన భార్తతో తను లాక్ డౌన్ లోనే ఉన్నానంటూ పోస్ట్ పెట్టాడు.

దీనికి పొంగిపోయిన పూజా కూడా సోషల్ మీడియాలో రెచ్చిపోయింది. ఈ ఏడాదిలో జాన్ తో గడిపిన మధుర క్షణాలన్నింటితో ఓ వీడియో చేసి రిలీజ్ చేసింది. అయితే ఈమె రిలీజ్ చేసిన వీడియో కంటే, జాన్ బయటపెట్టిన బికినీ ఫొటోనే ఎక్కువ వైరల్ అయింది. ప్రస్తుతానికైతే పూజా చేతిలో సినిమాల్లేవు. త్వరలోనే తన భర్తతో కలిసి జిమ్, ఫ్యాషన్ స్టుడియో పెట్టే ఆలోచనలో ఉంది ఈ బ్యూటీ.