ఇదీ పూజ స్టార్ డం

Pooja's stardom
Sunday, October 13, 2019 - 17:15

పూజ హెగ్డేకి ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో చెప్పడానికి ఈ రోజు ఆమెకి వచ్చిన విషెస్ ఒక ఉదాహరణ. నేడు ఆమె బర్త్ డే. పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ నటిస్తున్న 'ఆలా వైకుంఠాపురంలో', ప్రభాస్ కొత్త సినిమా మేకర్స్ ... ఆమె కోసం స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ రెండు సినిమాల్లో ఆమె హీరోయిన్. 

ఒక హీరోయిన్ కోసం ..పెద్ద హీరోల సినిమాల నిర్మాతలు కూడా బర్త్ డే పోస్టర్లు రిలీజ్ చేసారంటే ..దాని అర్థం ఆమె రేంజ్ చాలా ఎక్కవ అని. పూజ హెగ్డే తక్కువ టైంలో ఆ రేంజ్ కి ఎదిగింది. ఈ ఏడాది ఇప్పటికే 'గద్దలకొండ గణేష్' సినిమాలో చిన్న పాత్రకే కోటిన్నర పారితోషికం తీసుకొని తనకున్న క్రేజ్ ఏంటో చూపించింది.