ఆంటీ అంటే మంటే!

Poonam and Varalakshmi reply strongly to trolls
Sunday, March 8, 2020 - 16:30

కొంత సీనియారిటీ ఉన్న హీరోయిన్లను ఆంటీ అని సంబోధించడం చాలా మందికి అలవాటు. మాములుగా మన కన్వర్జేషన్ లో ఎలా మాట్లాడినా ఓకే. కానీ పబ్లిక్ ఫోరమ్ లో డీసెన్సీ ఉండాలి. ఎవరినైనా గౌరవించాలి. కానీ చాలాసార్లు కొందరు మగాళ్లు హీరోయిన్లను ఆంటీ అంటూ హేళనగా ట్వీట్ చేస్తుంటారు. అలా రెగ్యులర్ గా ఈ ప్రాబ్లెమ్ ఫెస్ చేసే వాళ్లలో పూనమ్ కౌర్, వరలక్ష్మి శరత్ కుమార్ ఉన్నారు. ఐతే, ఇలా ట్రోల్ చేసేవారిని చూసి సైలెంట్ గా ఉండే బాపతు కాదు వీళ్ళు. 

మొన్న వరలక్ష్మి బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంది. చాలామంది ఆమెని ఆంటీ అంటూ ట్రోల్ చేశారు. "నీకు 35 ఉంటాయా ఆంటీ," అని ఒకడు అడిగితే , "ఎస్, అయితే ఏంటి అంకుల్," అని ఘాటుగా రిటార్ట్ ఇచ్చింది. ఆంటీ అన్న ప్రతి వాడికి మంటలు రేగేలా సమాధానం ఇచ్చింది. 

తాజాగా పూనమ్ కౌర్ కూడా అలాగే రిటార్ట్ ఇస్తోంది. లేటెస్ట్ గా ఆమె ఒక ఫోటోని పోస్ట్ చేసింది. ఒకడు... బ్యూటిఫుల్ ఆంటీ అని కామెంట్ చేస్తే, "థాంక్యూ  అంకుల్" అని కూల్ గా రిప్లై ఇచ్చింది.