మంచి ఫొటోలు వాడండి ప్లీజ్

Poonam Kaur asks media to post good pics of her
Saturday, May 30, 2020 - 16:00

"మీరు ఎలాగూ మంచి స్టఫ్ ఇవ్వరు. నాకు తెలుసు. కనీసం నాకు సంబంధించి మంచి ఫొటోలైనా పోస్ట్ చేయండి. బ్యాడ్ డే ఫొటోను తీసుకోకండి. స్టోరీ ఎలాగూ మంచిగా ఉండదు. కనీసం ఫొటోనైనా సరిగ్గా పెట్టండి."

హీరోయిన్ పూనమ్ కౌర్ ఆవేదన ఇది. మంచి వార్తలు రాయకపోయినా ఫర్వాలేదు, కనీసం మంచి ఫొటోలైనా వాడండంటూ సూచించింది పూనమ్.

రీసెంట్ గా ఓ పోస్ట్ చేసింది  పూనమ్ కౌర్. ఫ్రీడమ్ అని అమ్మ నాన్నని వదిలేసి, డబ్బు కోసం క్యారెక్టర్‌ని వదిలేసిన అమ్మాయి ఒక వేశ్య కంటే దారుణం. మనిషిగా మారు మృగం అంటూ సుదీర్ఘంగా ఓ పోస్ట్ పెట్టింది. దీన్ని హైలెట్ చేసిన ఓ వెబ్ సైట్, ఆ ఆర్టికల్ కింద పూనమ్ కు చెందిన మంచి ఫొటో పెట్టలేదు. దీనిపై పూనమ్ సీరియస్ అయింది.