డిప్రెషన్ లో ఉంటే నన్ను ఫాలో అవ్వండి

Poonam Kaur urges depressed people to follow her
Saturday, June 20, 2020 - 19:15

డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటాయని, వాటి నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిదని అంటోంది పూనమ్ కౌర్. తను కూడా డిప్రెషన్ లెవెల్ ను దాటుకొని వచ్చానని, ఒక దశలో తన అనుకున్న వాళ్ల కూడా హ్యాండ్ ఇచ్చారని చెప్పుకొచ్చింది.

"ఒక టైమ్ లో బాగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. ఆ టైమ్ లో ఓ డైరక్టర్ నాతో 'నువ్వు చచ్చిపోతే మాకు ఒక రోజు న్యూస్ మాత్రమే' అని చెప్పాడు. ఆ మాటకు నేను షాక్ అయ్యాను. బాగా హర్ట్ అయ్యాను. ఆ డైరక్టర్ ను మళ్లీ నేను చూడలేదు."

ఆ దర్శకుడు చెప్పిన ఆమాట తర్వాత తనలో పట్టుదల పెరిగిందని అంటోంది పూనమ్ కౌర్. తన జీవితం ఎందుకూ పనికిరాదా అనే ఆలోచన నుంచి మొదలుపెట్టి డిప్రెషన్ నుంచి పూర్తిగా కోలుకున్నానని చెప్పుకొచ్చింది.  

"డిప్రెషన్ కు లోనైనప్పుడు నేను మా అమ్మను చూస్తాను. బోర్డర్ లో ఉన్న సైనికుల్ని గుర్తుచేసుకుంటాను. వాళ్ల సేవల్ని గుర్తుచేసుకుంటాను. అప్పుడు ఆటోమేటిగ్గా డిప్రెషన్ పోతుంది. ఈ విషయంలో అంతా నన్ను ఫాలో అయితే మంచిది."