పూనమ్ పీకే మాస్క్ చూశారా?

Poonam wears PK Love mask
Wednesday, May 27, 2020 - 23:45

మాస్క్ ధరించండి .. అని సెలెబ్రిటీలు అందరూ చెప్తున్నారు కదా. కేటీఆర్ వంటి మంత్రులు ఐతే రోజుకో డిజైన్ చేనేత మాస్క్ లతో కనిపిస్తున్నారు. చేనేత ఉత్పత్తులు ప్రోత్సహించేందుకు ఆలా రంగు రంగుల డిజైన్డ్ మాస్క్ లు ధరిస్తున్నారు కేటీఆర్. పూనమ్ ఏకంగా PK LOVE అనే పేరుతో ఒక మాస్క్ ధరించింది. ఐతే, అది ఒక అభిమాని చేసి పంపాడట. 

ఇంతకీ pk అంటే ఏమి అనుకుంటున్నారు. pk అంటే పూనమ్ కౌర్. ఆమె తన ప్రతి ట్వీట్ కి #PKLove అని సైన్ చేస్తుంది. పూనమ్ కౌర్ విత్ లవ్ అని అర్థంలో. అదే సిగ్నేచర్ ని ఇలా మాస్క్ కి ఇంప్రింట్ చేసింది అన్నమాట.