'కమిట్ మెంట్' లేకపోతే ఎదగలేమా!

Poornitha Kalyan reveals secret behind 'commitments'
Tuesday, June 2, 2020 - 17:00

మీటూ ఉద్యమం జోరుగా సాగిన రోజుల్లో.. టాలీవుడ్, కోలీవుడ్ కంటే మల్లూవుడ్ లోనే ఎక్కువగా కాస్టింగ్ కౌచ్ ఉదంతాలు బయటపడ్డాయి. మలయాళ నటుడు దిలీప్ ఉదంతంతో ఆ పరంపర చాన్నాళ్ల పాటు కొనసాగింది. ఇప్పటికే కొంతమంది హీరోయిన్లు తమకు గతంలో ఎదురైన చేదు అనుభవాల్ని బయటపెడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో మరో మలయాళీ నటి పూర్ణిత అలియాస్ కల్యాణి కూడా తన కాస్టింగ్ కౌచ్ అనుభవాల్ని బయటపెట్టింది.

హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చిందట పూర్ణిత. మలయాళ, తమిళ సినిమాలతో పాటు తెలుగులో "మళ్లీ మళ్లీ" అనే మూవీ కూడా చేసింది. ఈ క్రమంలో కొంతమంది ఆమెను పడక గదిలోకి లాక్కెళ్లడానికి ప్రయత్నించారు. పడుకుంటేనే ఆఫర్లు ఇస్తామని ప్రపోజ్ చేశారట. "కమిట్ మెంట్" ఇవ్వకపోతే చిన్న చిన్న పాత్రలు కూడా రావని బెదిరించారట.

దీంతో హీరోయిన్ ఆశలు వదులుకొని సీరియల్స్  వైపు వచ్చానని చెబుతోంది పూర్ణిత. అయితే సీరియల్ ఫీల్డ్ కూడా మంచిదేం కాదంటోంది. ఈ రంగంలో కూడా తనకు వేధింపులు, కాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది. అందుకే సీరియల్స్ కూడా మానేసి యాంకరింగ్ వైపు వచ్చానంటోంది. యాంకరింగ్ ఫీల్డ్ లో కూడా తనకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చింది.