అది కాపాడాల‌ని తెలుసు: స‌మంత అక్కినేని

Post wedding Samantha Akkineni meets the media
Thursday, October 12, 2017 - 18:30

స‌మంత అక్కినేని వారి కోడ‌లుగా ఒదిగిపోయింది. పెళ్లి త‌ర్వాత మొద‌టిసారి మీడియా ముందుకొచ్చిన ఈ కొత్త పెళ్లి కూతురు త‌నకి విషెష్ చెప్పిన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపింది. అక్కినేని ఫ్యామిలీ ఇమేజ్‌ని కాపాడాల‌న్న విష‌యం త‌న‌కి తెలుసు అని అంటోంది ఈ బ్యూటీ.

"నా లైఫ్‌లో గొప్ప విష‌యం ఏంటంటే నా బెస్ట్ ఫ్రెండ్‌నే పెళ్లి చేసుకోవ‌డ‌మే"న‌ని అంటోంది స‌మంత‌."ఫ్రెండ్‌నే పెళ్లి చేసుకున్నా నాకు కొన్ని బాధ్య‌త‌లుంటాయి. అక్కినేని ఫామిలీకి ఒక పాలసీ వుంది. ఆడపిల్లల్ని కూడా మ‌గ‌వారితో సమానంగా చూస్తారు. అది చాలా గొప్ప విష‌యం. అమ్మాయిల‌కి ఎంతో ఫ్రీడం ఇస్తారు. అయితే,  అక్కినేని సమంతగా కొన్ని బాధ్య‌త‌లుంటాయి. అక్కినేని కుటుంబ గౌరవాన్ని క‌చ్చితంగా నిలబెడతాను,"అని స‌మంత చెప్పింది.

అక్టోబ‌ర్ 6న ఆమె నాగ చైత‌న్య‌ని పెళ్లాడింది. గోవాలోని ఒక రిసార్ట్‌లో జ‌రిగిన వీరి డెస్టినేష‌న్ వెడ్డింగ్ జాతీయ స్థాయి మీడియాని సైతం ఆక‌ట్టుకొంది.

మ‌నం సినిమా షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే వీరిద్ద‌రూ డేటింగ్ మొద‌లుపెట్టారు. ఆటోన‌గ‌ర్ సూర్య షూటింగ్ టైమ్‌లో ప్రేమ‌గా మారింది. అలా రెండేళ్ల పాటు సాగిన వీరి ప్రేమ వివాహ‌బంధంగా మారింది. స‌మంత ఇప్ప‌టికే ట్విట్ట‌ర్‌లోనూ, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ త‌న పేరును స‌మంత అక్కినేనిగా మార్చేసింది.