అల్లు అర‌వింద్‌కి దూరంగా ప‌వ‌ర్‌స్టార్‌

Powerstar Pawan Kalyan's comments about Allu Aravind
Thursday, December 7, 2017 - 15:30

చిరంజీవి బావ‌మ‌రిది, ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్ అంటే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి ప‌డ‌దు. అన్న‌య్య చిరంజీవితో పూర్తిగా క‌లిసిపోయినా...అల్లు అర‌వింద్‌, అల్లు అర్జున్‌ని పూర్తిగా దూరం పెట్టారు ప‌వ‌ర్‌స్టార్‌. ఆ విష‌యం మ‌రోసారి ప్రూవ్ అయింది. తాజాగా ప‌వ‌ర్‌స్టార్ రాజ‌మండ్రిలో త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో  సుదీర్ఘంగా మాట్లాడారు. జ‌న‌సేన‌లోకి ఎలాంటి వారిని తీసుకుంటానో, ఎలాంటి వారిని తీసుకోలేనో వివ‌రంగా చెప్పారు.

అల్లు అర‌వింద్‌, ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ వంటి వారికి త‌న పార్టీలు చాన్స్ ఉండ‌ద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టడం మొత్తం స్పీచ్‌కే హైలెట్‌. ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌పై ఘాటుగా స్పందించారు ప‌వ‌ర్‌స్టార్‌. త‌న అన్న‌య్య పెట్టిన ప్ర‌జారాజ్యం పార్టీకి ద్రోహం చేసిన నెంబ‌ర్‌వ‌న్ క్యాండిడేట్ ప‌ర‌కాల అని చెప్పారు జ‌న‌సేనాని.

ఇక అల్లు అర‌వింద్ అప్ప‌ట్లో త‌న‌ని అస్స‌లు సీరియ‌స్‌గా తీసుకోలేద‌న్నారు. చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌ల‌ని చూసిన‌ట్లే ఒక సినిమా న‌టుడిగానే చూశారు త‌ప్ప ఒక సామాజిక స్పృహ ఉన్న నాయ‌కుడిగా ఆయ‌న న‌న్ను ప‌రిగ‌ణించ‌లేదు. అల్లు అర‌వింద్ గురించి మ‌రీ ఎక్కువ‌గా మాట్లాడ‌లేదు కానీ బిట్విన్ ది లైన్స్ బ‌ట్టి...అల్లు క్యాంప్‌ని కంప్లీట్‌గా ప‌వ‌ర్‌స్టార్ ప‌క్క‌న పెట్టిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

పార్టీలో త‌ప్పు జ‌రుగుతున్న‌పుడు వాటి గురించి మాట్లాడ‌ని వారు మ‌న‌కొద్దు. అలాంటి వారిని తీసుకోమ‌ని చెప్పారు ప‌వ‌ర్‌స్టార్‌.