అంత‌ర్జాతీయ సింగ‌ర్‌కి ప్ర‌భాస్ విందు

Prabhaas all set to organise bash for Bryan Adams
Saturday, September 8, 2018 - 23:00

ప్ర‌భాస్ ఇపుడు లోక‌ల్ హీరో కాదు. గ్లోక‌ల్ క‌థానాయ‌కుడు. గ్లోబ‌ల్ ప్ల‌స్ లోక‌లిస్తే గ్లోక‌ల్ అన్న‌మాట‌. లోక‌ల్‌గా టాలీవుడ్ సినిమాలు చేసి గ్లోబ‌ల్ లెవ‌ల్లో పాపుల‌ర్ అయ్యాడు బాహుబ‌లి సినిమాల పుణ్య‌మాని. అందుకే అంత‌ర్జాతీయ పాపుల‌ర్ సింగ‌ర్ బ్రియ‌న్ ఆడ‌మ్స్ ప్ర‌భాస్ విందుఆఫ‌ర్‌కి ఓకే అన్నాడు. 

ఎవ్రీథింగ్ ఐ డూ ఫ‌ర్ యూ, రెక్‌లెస్ వంటి ఆల్బ‌మ్‌ల‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయిన బ్రియాన్ ఆడ‌మ్స్ ఇండియాలో సంగీత ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించ‌నున్నాడు. వ‌చ్చే నెల‌లో ముంబై, హైద‌రాబాద్‌, బెంగ‌ళూర్ న‌గ‌రాల్లో బ్రియాన్ ఆడ‌మ్స్ క‌న్సార్ట్‌లుంటాయి. అక్టోబ‌ర్ 11న హైద‌రాబాద్‌కి వ‌స్తున్న బ్రియాన్‌కి బిర్యానీ  రుచి చూపిస్తాడ‌ట‌. భీమ‌వ‌రం రొయ్య‌లు, పీత‌ల‌తో పాటు హైద‌రాబాద్ బిర్యానీల‌తో మాంచి విందు ఇవ్వ‌నున్నాడు బ్రియాన్‌కి. 

బ్రియాన్ ఇండియాలో అడుగుపెట్ట‌గానే ముంబైలో అమితాబ్ బ‌చ్చ‌న్ విందు ఇవ్వ‌నున్నాడు. హైద‌రాబాద్‌లో ప్ర‌భాస్ డిన్న‌ర్ పార్టీ ఇస్తాడ‌ట‌.