లండన్ లోనే ప్రభాస్ బర్త్ డే సంబరం

Prabhas to celebrate birthday in London
Tuesday, October 22, 2019 - 14:45

రానా హైదరాబాద్ కి బ్యాక్ వస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫోటో పెట్టుకున్నాడు. బాహుబలి సంగీత కన్సర్ట్ లో పాల్గొనేందుకు రానాతో పాటు వెళ్లిన ప్రభాస్ మాత్రం లండన్ లోనే వుండిపోయాడు. అక్కడే తన బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు . అక్టోబర్ 23... ప్రభాస్ పుట్టిన రోజు. ఈ స్పెషల్ డేని లండన్ లో గ్రాండ్ గా ఎంజాయ్ చేద్దామని అక్కడే ఉన్నాడు. ఈ వీకెండ్ కి ప్రభాస్ తిరిగి హైదరాబాద్ వస్తాడు. 

వచ్చే నెల నుంచి కొత్త సినిమా షూటింగ్ షురూ చేస్తాడట. ఇప్పటికే కొంత భాగం ఈ సినిమా పూర్తి చేసాడు. జాను అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ లవ్ స్టోరీకి రాధాకృష్ణ దర్శకుడు. పూజ హెగ్డే హీరోయిన్.