ఆంటీతో ప్రభాస్‌ చిందులు

Prabhas dances with Raveena Taondon
Thursday, August 22, 2019 - 15:15

రవీనా టాండన్‌ గురించి ఇంట్రడిక్షన్‌ అక్కర్లేదు. 90ల కుర్రాళ్లకి డ్రీమ్‌గాల్‌. వాన పాటలతో అప్పట్లో గ్లామర్‌ అంతా ఒలకబోసింది. ఆ టైమ్‌లోనే వయసుకొచ్చిన ప్రభాస్‌కి కూడా రవీన అంటే అంతో ఇంతో లైక్‌ ఉండే ఉంటుంది. అందుకే రవీనా నాకు ఇష్టమైన నటి అని అంటున్నాడు. సాహో సినిమా ప్రమోషన్‌లో భాగంగా రవీనాతో కలిసి స్టెప్పులేశాడు. 

హిందీ బుల్లితెరపై పాపులర్‌ ప్రాగ్రామ్‌..నచ్‌ బలియే. తొమ్మిదో సీజన్‌ నడుస్తోందిపుడు. ఈ కార్యక్రమంలో పాల్గొని సాహో సినిమాని ప్రమోట్‌ చేశాడు ప్రభాస్‌. ఈ షోకి జడ్జిగా వ్యవహరిస్తోన్న రవీనాతో స్టేజ్‌పై చిందులేశాడు ప్రభాస్‌. సల్మాన్‌ఖాన్‌ నటించిన ఓ సినిమా పాటకి ప్రభాస్‌ ఇలా రవీనా కొంగు పట్టుకొని డ్యాన్స్‌ చేశాడు. 

రవీనా కూడా బాగా సిగ్గుపడిపోయింది. అందగాడైన ప్రభాస్‌ తనని పొగడడంతో బాగా ఖుషీ అయింది ఈ 40 ప్లస్‌ ఆంటీ.