ప్రభాస్ సుడిగాలి పర్యటన

Prabhas to go for 5 city tour
Thursday, August 8, 2019 - 08:15

ప్రభాస్ కి సిగెక్కువ. చాలా రిజర్వడ్ పర్సన్. హిమాలయాలం క్రేజున్నా... ఫోజు కొట్టడు. జనంలో కలవడు. తన సినిమాలు విడుదలవుతున్నపుడు కూడా ఎంత ప్రమోట్ చేయాలో అంతే చేస్తాడు. కొన్ని ఇంటర్వ్యూలు, ఒకట్రెండ్ ప్రెస్ మీట్లు . ఇది ప్రభాస్ వరుస.

ఐతే ఈ సారి ప్రభాస్ "సాహో" కోసం మారిపోయాడు. "సాహో" భారీ బడ్జెట్ మూవీ. వందల కోట్ల రిస్క్ ముడిపడి ఉంది. ఏమాత్రం తేడా వచ్చినా... గోవిందా. అందుకే, ఈ సినిమాకి ఎంత హైప్ ఉన్నా... లాస్ట్ మినిట్లో చేయాల్సిన ప్రచారం వదలకూడదు. "బాహుబలి" సినిమాలకి రాజమౌళి అనే బ్రాండ్ ఉంది కాబట్టి ప్రభాస్ నేచురల్ స్టయిల్ ఆఫ్ ప్రమోషన్స్ నడిచిపోయాయి. సాహోకి అలా కాదు. దర్శకుడు సుజీత్ కి హైదరాబాద్ దాటితే..ఎవరో తెలియదు. కేవలం ప్రభాస్ పేరు మీదే ఈ సినిమాకి ఇంత క్రేజు వచ్చింది.

ప్రభాస్ "సాహో" కోసం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో సుడిగాలి పర్యటన వేయనున్నాడు. మెయిన్ నగరాలన్నింటిలో ప్రెస్ మీట్, ఈవెంట్స్ చేస్తాడట.