విసుగొచ్చేస్తోంది: ప్రభాస్

ఇక పడ్డ తిప్పలు చాలు..ఇకపై రిస్క్ తీసుకోను అంటున్నాడు యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్. ఒక్కో సినిమాకి రెండేళ్లు, మూడేళ్లు పడుతుండడంతో ప్రభాస్‌కి విసుగొచ్చింది. బాహుబలి చిత్రాలకి అన్ని ఏళ్లు కష్టపడడం నచ్చిందట. ఎందుకంటే ఈ రోజు వచ్చిన ఫేమ్ అంతా దాని పుణ్యమే కదా. ఐతే సాహో వంటి చిత్రాల మేకింగ్ తర్వాత మాత్రం ఇంత రిస్క్ ఇకపై వద్దనుకుంటున్నాడు.
సాహోకి రెండేళ్ల టైమ్ తప్పలేదు కానీ ఇకపై ఇలాగే చేస్తే...ఫ్యాన్స్ ఊరుకోరు అన్న విషయం నాకు తెలుసు అంటున్నాడు. కొంచెం స్పీడ్ పెంచాల్సిన టైమ్ వచ్చింది. అంతేకాదు, అన్ని వేళలా అంత రిస్క్ మంచిది కాదు. ఇకపై రెగ్యులర్ సినిమాలు చేయాల్సిందే. ఇది ప్రభాస్ చెపుతున్నమాట.
ప్రభాస్ నటిస్తున్న మరో మూవీ సెట్‌పై ఉంది. అది 40 శాతం పూర్తయింది. మిగతా 60 శాతం స్పీడ్‌గా పూర్తి చేస్తానంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ తదుపరి చిత్రాన్ని స్పీడ్‌గా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్‌కి రిలీజ్ చేస్తాడట. ఈ సినిమాని జిల్ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తీస్తున్నాడు. ఇది లవ్‌స్టోరీ. పూజా హెగ్డే హీరోయిన్.
- Log in to post comments