మిగతా హీరోలు అందుకోలేని రేంజ్ లో ప్రభాస్

Prabhas proves his mettle again as a superstar
Sunday, September 1, 2019 - 23:30

"సాహో" సినిమాకి వచ్చిన టాక్ వేరు, వస్తున్న కలెక్షన్లు వేరు. క్రిటిక్స్ బాలేదన్నారు. మౌత్ టాక్ కూడా అదే స్థాయిలో వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం కుమ్ముతున్నాయి. ముఖ్యంగా ఆదివారం హిందీ వెర్షన్ దాదాపు 30 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇది దిమ్మతిరిగిపోయే అమౌంట్. ఈ ఏడాది విడుదలైన సల్మాన్ ఖాన్ సినిమా 'భరత్' కూడా తోలి ఆదివారం 30 కోట్ల అమౌంట్ టచ్ చెయ్యలేక పోయింది. అంటే.. నార్త్ ఇండియన్ మార్కెట్ లో బాలీవుడ్ హీరోలని మించిపోయాడు ప్రభాస్. 

ప్రస్తుతం 'సాహో'నార్త్ ఇండియాలో ఆడుతున్న తీరు చూస్తుంటే... బాలీవుడ్ హీరోలు కూడా ఫ్యూచర్లో ప్రభాస్ సినిమా రిలీజ్ ఎప్పుడో తెలుసుకొని తమ సినిమాలని ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక టాలీవుడ్ లో ఏ హీరో కూడా ఇప్పట్లో ఈ రేంజిలో ఇండియా అంతా వసూళ్లు సాధించడం కష్టం. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభాస్ సాధించిన తొలి వీకెండ్ ఓపెనింగ్స్, ఇతర పెద్ద హీరోల సినిమాల తొలి వీకెండ్ ఓపెనింగ్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రభాస్ అందనంత దూరంలో ఉన్నాడు. 

'బాహూబలి' సినిమాల తర్వాత ప్రభాస్ కి వచ్చిన క్రేజ్ ఇది. అది ఇప్పటికి తగ్గలేదని క్లియర్ గా అర్థం అవుతోంది. 'సాహో' సినిమా బాలేదనేది ఎంత నిజమో... ఈ సినిమా ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్స్ కళ్ళు చెదిరేవిధంగా ఉన్నాయన్నది అంతే నిజం. ఇదంతా ప్రభాస్ మేనియా పుణ్యమే.