సాహో లుక్ ఇంకా ఫిక్స్ అవ్వలేదట

Prabhas Saaho Look Yet to fix?
Tuesday, July 18, 2017 - 11:30

ప్రభాస్ కు సంబంధించిన లేటెస్ట్ మేకోవర్ తో ప్రస్తుతం ఓ స్టిల్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నిన్న సాయంత్రం నుంచి ఆ ఫొటో వైరల్ అవుతోంది. సాహో సినిమాలో ప్రభాస్ లుక్ ఇదేనంటూ చాాలామంది డిస్కషన్లు కూడా షురూ చేశారు. అయితే మేకర్స్ నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం.. సాహో సినిమాలో ప్రభాస్ లుక్ ను ఇంకా ఫిక్స్ చేయలేదట.

సినిమా సెట్స్ పైకి రావడానికి ఇంకా 15 రోజులకు పైగానే టైం ఉంది. ఈ గ్యాప్ లో ఓ లుక్  ఫిక్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 2-3 మేకోవర్స్ ప్రయత్నించినప్పటికీ దేన్నీ ఇంకా ఫైనలైజ్ చేయలేదని తెలుస్తోంది. పైన ఫొటోలో చూస్తున్న ఈ రెండు గెటప్స్ మాత్రమే బయటకొచ్చాయి. ఇవి కాకుండా మరో 2 లుక్స్ కూడా ఉన్నాయట. వీటిలో ఏ మేకోవర్ ఓకే అవుతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్

వచ్చే నెల నుంచి సాహో సినిమా సెట్స్ పైకి రానుంది. సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ ను ఫిక్స్ చేయలేదు.