జాను వచ్చాడు, ఇక జాన్ రాడేమో

Prabhas's Jaan will get another title?
Tuesday, January 7, 2020 - 21:00

శర్వానంద్ సినిమాకు జాను అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సినిమాలో సమంత పాత్ర పేరు ఇది. తమిళ్ లో కల్ట్ లవ్ స్టోరీగా గుర్తింపు తెచ్చుకున్న 96 సినిమాకు రీమేక్ కు ఇది వస్తోంది. దిల్ రాజు బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు జాను టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు విడుదల చేశారు.

తాజా ప్రకటనతో ప్రభాస్ సినిమా ఇప్పుడు డైలమాలో పడింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాకు జాన్ అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. ప్రస్తుతానికి అదే తమ వర్కింగ్ టైటిల్ అంటూ గతంలో ప్రభాస్ కూడా ప్రకటించాడు. అంతలోనే జాను అనే టైటిల్ తో దిల్ రాజు తన సినిమా పోస్టర్ రిలీజ్ చేశాడు.

సో.. ప్రభాస్ సినిమాకు ఇక జాన్ అనే టైటిల్ పెట్టకపోవచ్చు. నిజానికి అర్థాల పరంగా చూసుకుంటే ఈ రెండు టైటిల్స్ వేరు వేరు. కానీ కేవలం అక్షరం పొల్లు మాత్రమే తేడా ఉండడం ప్రభాస్ టీమ్ ను ఇప్పుడు డైలమాలో పడేసింది. పైగా ప్రభాస్ మూవీ కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ అవుతోంది. దీంతో జాన్ అనే టైటిల్ నుంచి ఈ యూనిట్ దాదాపు బయటకు వచ్చేసినట్టే అనుకోవాలి.