ప్రభాస్ మైనపు విగ్రహం ఎలా ఉందంటే!

Prabhas's wax statue
Tuesday, May 2, 2017 - 16:00

ఓవైపు బాహుబలి-2 థియేటర్లలోకి వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా సినిమా బ్రహ్మాండంగా ఆడుతోంది. ఈ సినిమాతో పండగ చేసుకుంటున్న యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు మరో పండగ లాంటి వార్త ఇది. అవును.. ప్రభాస్ మైనపు విగ్రహం రెడీ అయిపోయింది.

బ్యాంకాక్ లోని టుస్సాడ్స్ మ్యూజియంలో ఈ మైనపు బొమ్మను పెట్టారు. బాహుబలి గెటప్ లో ప్రభాస్ మైనపు విగ్రహం అదిరిపోయింది. దూరం నుంచి చూస్తే సేమ్ టు సేమ్ బాహుబలి గెటప్ లో ప్రభాస్ నిల్చున్నట్టే ఉంది. కాకపోతే.. కాస్త జూమ్-ఇన్ చేసి పరీక్షగా చూస్తే మాత్రం నిర్వహకులు.. ప్రభాస్ ముఖకవలికల్ని పర్ ఫెక్ట్ గా క్యాప్చూర్ చేయలేదనిపిస్తోంది.

సరే.. ఈ డ్రాబ్యాక్స్ సంగతి పక్కపెడితే.. ఓ తెలుగు హీరో టుస్సాడ్స్ మ్యూజియంలోకి ఎంటర్ అయ్యాడంటే గొప్ప విషయమే కదా.