పోకిరిని మళ్లీ వాడేస్తోన్న ప్రభుదేవా

Prabhu Deva as Krishna Manohar IPS
Thursday, November 21, 2019 - 12:00

కృష్ణ మనోహర్ మహేష్ బాబు కాదు.... ఈ మాట అంటే మహేష్ అభిమానులకో కోపం వస్తుంది. కొట్టేంత పని కూడా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ పేరు అంటే వాళ్లకు అంత అభిమానం. పోకిరి లాంటి ట్రెండ్ సెట్టర్ మూవీలో మహేష్ పేరు ఇది. అందుకే ఆ పేరు అంటే ఫ్యాన్స్ కు అంత పిచ్చి. కానీ ఇప్పుడా పేరును మహేష్ బాబుకు వాడలేం. ఎందుకంటే కృష్ణ మనోహర్ అనే టైటిల్ తో ఓ సినిమా వస్తోంది. హీరో ప్రభుదేవా.

అవును.. తమిళ్ లో ప్రభుదేవా చేస్తున్న ఓ సినిమాను తెలుగులో కృష్ణమనోహర్ ఐపీఎస్ పేరుతో విడుదల చేయబోతున్నారు. టైటిల్ కు తగ్గట్టు సినిమాలో పోలీస్ గా కనిపించబోతున్నాడు ప్రభుదేవా. నివేత పెతురాజ్ ఇందులో హీరోయిన్.

గమ్మత్తైన విషయం ఏంటంటే.. పోకిరి సినిమాను ప్రభుదేవా వాడుకున్నట్టు ఎవ్వరూ వాడుకోలేదు. ఈ సినిమాను సల్మాన్ హీరోగా హిందీలో రీమేక్ చేశాడు ప్రభుదేవా. బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సల్మాన్ కు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు. ఇదే సినిమాను తమిళ్ లో విజయ్ హీరోగా రీమేక్ చేశాడు. అక్కడ కూడా సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాలో హీరో పేరును కూడా వాడేస్తున్నాడు ప్రభుదేవా. వాడకం అంటే ఇదేనేమో.