ఇబ్బందిపెట్టిన ఆ కమెడియన్ ఎవరు?

Pragathi was harassed by a comedian
Monday, May 4, 2020 - 16:45

సినిమాలతో బిజీగా ఉండడమే కాదు, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి. నిత్యం తన అభిమానులతో, తెలుగు ప్రేక్షకులతో టచ్ లో ఉంటుంది. అయితే టాలీవుడ్ ను ఇబ్బందిపెట్టిన క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం ప్రగతిని కూడా ఇబ్బంది పెట్టిందట. తనకు ఎదురైన అలాంటి చేదు అనుభవాన్ని తాజాగా బయటపెట్టింది ఈ నటి.

ఓ పెద్ద సినిమాకు సంబంధించి ఓ స్టార్ కమెడియన్ కాంబినేషన్ లో షూటింగ్ జరుగుతోందట. అంతా సందడిగా సాగిపోతున్న టైమ్ లో, సదరు స్టార్ కమెడియన్ అసభ్యంగా మాట్లాడ్డం ప్రారంభించాడట. ఆయన మాటలు, చేష్టలు కాస్త తేడాగా అనిపించి ప్రగతిని తెగ ఇబ్బంది పెట్టాయట.

షూటింగ్ గ్యాప్ లో సదరు స్టార్ కమెడియన్ కారవాన్ లోకి వెళ్లిందట ప్రగతి. నలుగురి మధ్య పంచాయితీ పెడితే బాగుండని, కారవాల్ లోకి వెళ్లి అతడి పద్ధతి, ప్రవర్తన బాగాలేదని చెప్పిందట. ఆయన ప్రవర్తన కారణంగా తను ఇబ్బంది పడుతున్నాననే విషయాన్ని ముఖంమీద చెప్పేసిందట.

ఆ టైమ్ లో సైలెంట్ గా ఉండిపోయిన ఆ స్టార్ కమెడియన్.. ఆ తర్వాత ప్రగతిపై దుష్ప్రచారం మొదలుపెట్టాడట. తనకు చాలా పొగరని, పెద్ద సినిమాల్ని ఇబ్బంది పెడుతుందంటూ అసత్య ప్రచారం చేశాడట. ఇన్ని విషయాలు చెప్పిన ప్రగతి, ఆ స్టార్ కమెడియన్ ఎవరో కూడా బయటకు చెప్పేసి ఉంటే ఓ పనైపోయేది. ఇండస్ట్రీలో అలాంటి వాళ్లకు ఓ గుణపాఠంగా ఉండేది.