కేక పుట్టిస్తున్న ప్రగతి

Pragati posts stunning dance video
Monday, April 13, 2020 - 17:15

ప్రగతి.. ఈ పేరు చెప్పగానే సంప్రదాయబద్ధమైన పాత్రలు కళ్లముందు కదలాడుతాయి. ఆమె పలికించే హావభావాలు, ఆ సెంటిమెంట్ సీన్లు బ్యాక్ టు బ్యాక్ గుర్తొస్తాయి. చాలామంది హీరోహీరోయిన్లకు తల్లిగా నటించిన ఈమె.. పూర్తిగా అలాంటి హోమ్లీ పాత్రలకే పరిమితమైపోయింది. దీంతో ఆమెకు అలాంటి ఇమేజే వచ్చింది. అయితే వెండితెరపై ఈమె ఇమేజ్ కు.. సోషల్ మీడియాలో ఈమెకున్న ఫాలోయింగ్ కు అస్సలు సంబంధం ఉండదు.

సిల్వర్ స్క్రీన్ పై క్లాసికల్ గా కనిపించే ప్రగతి.. సోషల్ మీడియాలో మాత్రం తన ఒరిజినల్ లైఫ్ ను చూపిస్తారు. మనసుకు నచ్చినట్టు ఉంటారు. ఎప్పటికప్పుడు తను జిమ్ చేసే ఫొటోల్ని, కుటుంబ సభ్యుల ఫొటోల్ని పెడుతుంటారు. ఇందులో భాగంగా రీసెంట్ గా ప్రగతి చేసిన మాస్ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయికూర్చుంది.

విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో ఓ మాస్ నంబర్ కు ప్రగతి డాన్స్ చేసింది. ఏమాటకామాట డాన్స్ చించేసింది. వీడియోకు మరింత లుక్ తీసుకొచ్చేందుకు మాస్ లుక్ లో రెడీ అయిన ఈ క్యారెక్టర్ నటి.. మాస్ స్టెప్స్ తో ఓ ఊపు ఊపింది. ప్రగతిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని చూసినవాళ్లు ఆశ్చర్యపోతున్నారు.

అప్పుడెప్పుడో వచ్చిన బాద్షా సినిమాలో ఓ మాస్ నంబర్ కు చిన్న డాన్స్ బిట్ యాడ్ చేసింది ప్రగతి. మళ్లీ ఇన్నేళ్లకు ఆమెలోని మాస్ యాంగిల్ బయటపడింది.