లాయర్ టు గ్లామర్ గాళ్

Pragya Jaiswal wanted to become a lawyer
Monday, May 18, 2020 - 15:15

లాయర్ అవుదామనుకొని పొరపాటున హీరోయిన్ అయ్యానంటోంది ప్రగ్యా జైశ్వాల్. కాలేజ్ రోజుల్లో చేసిన మోడలింగ్ తన ఆలోచనను మార్చేసిందని, అలా అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చానని చెబుతోంది. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ.. ఈ లాక్ డౌన్ వల్ల బనానా చాక్లెట్ కేక్ తయారుచేయడం ఎలాగో నేర్చుకున్నాననంటోంది.

- లాక్ డౌన్ లో నేర్చుకున్న మంచి విషయం
కుకింగ్, బేకింగ్ నేర్చుకున్నాను. మరీ ముఖ్యంగా బనానా చాక్లెట్ కేక్ చేయడం నేర్చుకున్నాను.

- లాక్ డౌన్ ఎలా గడుస్తోంది?
పొద్దున్నే లేవడం, వర్కవుట్ చేయడం. ఆ తర్వాత వంట చేసుకోవడం. ఇళ్లు, కిచెన్ అన్నీ శుభ్రం చేసుకోవడం, కొత్తగా ఏదైనా నేర్చుకోవడం.. ఇలా సాగిపోతోంది.

- ప్రస్తుతం ఏం చూస్తున్నారు?
ది లాస్ట్ కింగ్ డమ్ అనే వెబ్ సిరీస్ చూస్తున్నాను.

- టీ లేదా కాఫీ?

ఎప్పుడూ టీ తాగడానికే ఇష్టపడతాను

- ఎందుకు రెగ్యులర్ గా సినిమాలు చేయడం లేదు?
మంచి స్క్రిప్టుల కోసం వెయిటింగ్

- లాయర్ అవుదామని నటి అయ్యారు.. ఎలా అనిపిస్తోంది?
ఎప్పుడూ అనుకోలేదు. కాలేజ్ లో మోడలింగ్ చేసిన తర్వాత మాత్రమే నటి అవుదామని అనిపించింది. లేదంటే ఎప్పుడూ చదువే.

- డ్రీమ్ డైరక్టర్స్?
రాజమౌళి, సంజయ్ లీలా భన్సాలీ.. వీళ్ల దర్శకత్వంలో నటించాలనే కోరిక ఉంది

- క్వారంటైన్ లో గ్లామర్ కాపాడుకోవడం ఎలా?
ముఖాన్ని క్లెన్సింగ్ చేసుకోండి. ఆ తర్వాత టోనింగ్, మాయిశ్చరైజర్.. దీంతో పాటు బాగా నీళ్లు తాగాలి

- లాక్ తర్వాత కొత్త ప్రపంచాన్ని చూస్తామా?
అవును.. లాక్ డౌన్ తర్వాత ఓ సరికొత్త ప్రపంచాన్ని చూస్తామని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే కరోనా అనేది ప్రతి రంగాన్ని దెబ్బతీసింది. ప్రభుత్వం విధించిన ఆంక్షలు కంటే స్వీయ క్రమశిక్షణ చాలా అవసరం. ఎట్ లీస్ట్ వాక్సిన్ వచ్చేంత వరకైనా అంతా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి.

- పవన్ కల్యాణ్ గురించి?
ఆయనలో నాకు నిజమైన నాయకుడు కనిపిస్తాడు