బికినీలో ప్రగ్య రచ్చ

Pragya Jaiswal's bikini treat
Wednesday, January 22, 2020 - 18:45

ప్రగ్యాజైశ్వాల్.. చేసింది తక్కువ సినిమాలే. అందులో ఫ్లాపులే ఎక్కువ. అయినా అందం విషయంలో ఈ ముద్దుగుమ్మను తక్కువ అంచనా వేయడానికి లేదు. అయితే ఎక్కువ సినిమాల్లో ఆమె పద్ధతిగానే కనిపించింది. ఆమె అందాన్ని వెండితెర నిండుగా పూర్తిగా ఆస్వాదించే అవకాశం ప్రేక్షకులకు దక్కలేదు. ఇప్పుడా అవకాశాన్ని స్వయంగా ప్రగ్యా జైశ్వాల్ కల్పిస్తోంది. తాజాగా బికినీలో మెరిసిన ఈ ముద్దుగుమ్మ, ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

వారం రోజులుగా ఇండోనేషియాలోని బాలిలో తిష్టవేసింది ప్రగ్యా జైశ్వాల్. చేతిలో సినిమాలు కూడా లేకపోవడంతో అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసి, ఈమధ్యే హైదరాబాద్ తిరిగొచ్చింది. ఆ టైమ్ లోనే బాలి బీచ్ లో బికినీలో మెరిసింది ఈ బ్యూటీ. ఊహించని విధంగా ప్రగ్యాను బికినీలో చూసిన నెట్ జనాలు వావ్ అన్నారు.

ఈమధ్య కాలంలో కాస్త హాట్ గా కనిపించడానికి ప్రయత్నిస్తోంది ప్రగ్యా. ఫొటో షూట్స్ లో తొడలు కనిపించేలా నిక్కర్లు వేసుకోవడం, పైన తక్కువ దుస్తులు వేసుకోవడం లాంటివి చేస్తోంది. అలా కొన్ని రోజులుగా గ్లామరస్ గా కనిపిస్తున్న ఈ చిన్నది, ఇలా సడెన్ గా బికినీ ట్రీట్ ఇస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఈ బికినీ లుక్ అయినా ప్రగ్యాకు అవకాశాలు తెచ్చిపెడుతుందేమో చూడాలి.