ప్రకాష్ రాజ్ కి మళ్ళీ ప్రశంసలు

Prakash Raj gets compliments from Mahesh Babu
Wednesday, May 27, 2020 - 16:00

ప్రకాష్ రాజ్ తన వ్యక్తిత్వంతో ఇప్పటికే అందరి మన్ననలు పొందారు. ఇటీవల వలస కార్మికులకు ఆయన చేసిన సహాయం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకొంది. సామజిక దృక్పథం కలిగిన ప్రకాష్ రాజ్ మరోసారి కాంప్లిమెంట్స్ అందుకుంటున్నారు. బీబీసీ రూపొందించిన వైల్డ్ కర్ణాటక కార్యక్రమానికి ప్రకాష్ రాజ్ తన గొంతు ఇచ్చారు. 

తెలుగు, తమిళ భాషల్లో ఈ ప్రోగ్రాం కి వ్యాఖ్యాతగా ఉన్నారు ప్రకాష్ రాజ్. మహేష్ బాబు సహా పలువురు సెలబ్రిటీస్ ప్రకాష్ రాజ్ ని పొగిడారు.