దేశ‌ద్రోహుల‌తో ప్ర‌కాష్‌రాజ్‌!

Prakash Raj group photo sparks rumors
Tuesday, January 30, 2018 - 15:30

ప్ర‌కాష్‌రాజ్ ఇపుడు వార్త‌ల్లో నిలుస్తున్నారు. మోదీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప్ర‌కాష్‌రాజ్ కొంత‌కాలంగా జ‌స్ట్ ఆస్కింగ్ అంటూ చాలా ఆస్క్‌తున్నారు. ఆయన ఆస్క్‌... బీజేపీ వాళ్ళ‌కి ప‌నికిమాలిన హ‌స్క్ అనిపిస్తోంద‌ట‌. ఆ మాట ఎలా ఉన్నా.. ప్ర‌కాష్‌రాజ్ తాజాగా గుజ‌రాత్ ఎమ్మెల్యే మేవానీ, స్టూడెంట్ లీడ‌ర్ క‌న‌య్య‌, షీలా ర‌షీద్ వంటి ఇత‌ర మోదీ వ్య‌తిరేకుల‌తో క‌లిసి ఒక గ్రూప్ ఫోటో దిగాడు. ఈ ఫోటో ఇపుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. దేశాన్ని ముక్క‌లు ముక్క‌లు చేస్తామ‌న్న గ్యాంగ్‌తో ప్ర‌కాష్‌రాజ్ చేతులు క‌లిపాడ‌ని రైట్ వింగ్ ట్రాల‌ర్స్ ట్వీట్లు వేస్తున్నారు.

గౌరీ లంకేశ్ హత్య, మెర్సల్ మూవీ, పద్మావతి వివాదం వంటి ప‌లు అంశాల‌లో ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ హిందుత్వ వాదుల్ని సూటిగా తాకాయి. ప్రకాష్ రాజ్ మీద వ్యతిరేకత పెంచుకున్న వాళ్ళు.. ఆయన ఇమేజ్ ని  డామేజ్ చేయడం మొదలుపెట్టారు.