కాబోయే వాడు పొడుగ్గా ఉండాలి

Pranitha Subhash says she wants tall man as husband
Monday, May 4, 2020 - 10:15

మొన్నటికిమొన్న రాశిఖన్నా ఓ స్టేట్ మెంట్ ఇచ్చింది. తనకు కాబోయే వాడు చాలా పొడుగ్గా ఉండాలని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఇదే మాటను హీరోయిన్ ప్రణీత కూడా రిపీట్ చేస్తోంది. తనకు కాబోయే వ్యక్తిలో ఫిజికల్ గా ఎలాంటి క్వాలిటీస్ ఉన్నా లేకపోయినా మస్ట్ గా పొడుగ్గా ఉండాలంటోంది. 

దీంతో పాటు తన ఫస్ట్ క్రష్ డీటెయిల్స్ కూడా చెబుతోంది.

"నా ఫస్ట్ క్రష్ 8వ తరగతిలో జరిగింది. స్కూల్ ఫెస్ట్ లో ఓ అబ్బాయి గిటార్ వాయించాడు. అప్పుడు పడిపోయాను. అయితే ఇప్పుడు గిటార్ వాయిస్తే పడిపోను. ఇప్పుడు చాలా విషయాలు లిస్ట్ లోకి చేరాయి. నాకు ఓ అబ్బాయి నచ్చాలంటే, అతడు చాలా స్మార్ట్ గా ఉండాలి. నిజాయితీగా ఉండాలి. మరీ ముఖ్యంగా పొడవుగా ఉండాలి."  

తనకు కాబోయే వాడు 6 అడుగుల 4 అంగుళాల పొడవు ఉన్నా తనకు అభ్యంతరం లేదంటోంది ఈ బ్యూటీ. 

తనకు ఎవరూ ప్రపోజ్ కూడా చేయలేదని చెబుతోంది.

"ఇండస్ట్రీలోకి రాకముందు నాకోసం పడిచచ్చే బ్యాచ్ పెద్దగా లేదు. నేను అలాంటివి ఎంకరేజ్ చేయలేదు. చదువుకునేటప్పుడు చదువే లోకంగా ఉండేది. నాకు తెలిసి నాకు ఎవరూ ప్రపోజ్ చేయలేదు."