వెయ్యి కోట్ల సినిమా పని మొదలైంది

Pre production work starts for Mahabharata
Tuesday, July 18, 2017 - 17:00

భారతీయ సినీచరిత్రలోనే కాస్ట్ లీ మూవీగా తెరకెక్కనున్న ‘మహాభారతం’ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులపై ఫోకస్ పెట్టిన సినిమా యూనిట్, ఈ సినిమాలోని వార్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించడానికి ‘ లీ విట్కర్’ ని సంప్రదించినట్టు తెలుస్తుంది.  ‘లివ్ ఫ్రీ ఆర్ డై హార్డ్’, ‘ఫాస్ట్ ఫైవ్’ లాంటి హాలీవుడ్ సినిమాలకు స్టంట్స్ కంపోజ్ చేశాడు లీ. 2020లో రిలీజ్ ని టార్గెట్ చేసుకున్న ఈ సినిమాలో మోహన్ లాల్ భీముడిగా కనిపించబోతున్నాడు.

1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాని BR శెట్టి నిర్మిస్తున్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఇతను అతిపెద్ద వ్యాపారవేత్త. సినిమాకి సంబంధించిన మిగతా  టెక్నీషియన్స్ తో పాటు స్టార్స్ వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తారు. 

మలయాళంలో అత్యంత ప్రాచుర్యం పొందిన రండమోజమ్ గ్రంధం ఆధారంగా మహాభారతం తెరకెక్కనుంది.  భీముడి పాత్రధారి ద్వారా మహాభారతాన్ని చెప్పడం ఈ గ్రంధం ప్రత్యేకత. అందుకే ముందు ఆ పాత్రను ఎంపిక చేశారు.