సారీ చెప్పిన సొట్ట‌బుగ్గల సుంద‌రి

Preity Zinta says sorry to women on Me Too comments
Wednesday, November 21, 2018 - 00:15

ప్రీతి జింటా గుర్తుందా? మొద‌ట ప‌్రేమంటే ఇదేరా, రాజ‌కుమారుడు వంటి తెలుగు సినిమాల్లో న‌టించి, ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో రారాణిగా ఎదిగింది. ఇపుడు సినిమాల్లో న‌టించ‌డం లేదు. ఐతే ప్రీతి జింటా రీసెంట్‌గా మీటూ గురించి చేసిన కామెంట్స్‌తో వివాదంలో ఇరుక్కొంది. 

మొద‌ట స్వీటూ అంటారు ఆ త‌ర్వాత మీటూ అంటారు కొంద‌రు అమ్మాయిల గురించి ఓ బాలీవుడ్ సెల‌బ్రిటీ ఇలా త‌న‌తో చెప్పినట్లు న‌వ్వుతూ ఒక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. ఈ ఇంట‌ర్వ్యూ పెద్ద దుమారాన్ని రేపింది. అలాగే సినిమా ఇండ‌స్ట్రీలో త‌న‌ని ఎవ‌రూ లైంగికంగా వేధించ‌లేదు, అలా ఎవ‌రైనా నా ముందుకు అలాంటి ప్ర‌పోజ‌ల్ వ‌స్తే బాగుండున‌ట్లు మాట్లాడింది. ఐతే ఆ త‌ర్వాత ఆమె ఇచ్చిన వివ‌ర‌ణ ఏంటంటే..అలా ఎవ‌రైనా ఆ ప్ర‌పోజ‌ల్‌తో వ‌స్తే వారికి నా చెప్పుల దెబ్బ త‌డాఖా చూపించేదాన్ని అనే అర్థంలో అన్నాను అని వివ‌రించింది.