ప్రేమ‌క‌థా చిత్రం 2 వ‌స్తోంది!

Prema Katha Chitram 2 is ready
Wednesday, November 21, 2018 - 16:15

మారుతి క‌థ‌, క‌థ‌నంతో రూపొందిన "ప్రేమ‌క‌థా చిత్రం" ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలుసు. ఇపుడు ఆ సినిమాకి సీక్వెల్ రూపొందుతోంది. మారుతికి ఈ సినిమాకి సంబంధం లేదు. ఈ సీక్వెల్‌లో సుమంత్ అశ్విన్ హీరో.

ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో తెర‌కెక్కుతున్న చిత్రం "ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ 2" తో హ‌రి కిషన్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సుమంత్ అశ్విన్‌, సిద్ధి ఇన్నాని జంట‌గా న‌టిస్తున్నారు. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రంలో త‌న పెర్‌ఫార్మెన్స్ తో మెస్మ‌రైజ్ చేసిన నందిత శ్వేత మెయిన్ హీరోయిన్ గా న‌టిస్తుంది.  

ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. జ‌న‌వ‌రిలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. సూప‌ర్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మొద‌టి పార్ట్‌కి ధీటుగా వ‌స్తున్న ఈ చిత్రానికి నందిత శ్వేతా న‌ట‌న సూయ‌ర్ ప్ల‌స్ అవుతుందట‌.