క్వారంటైన్ లో ఆ హీరో 2 వారాలు

Prithviraj Sukumaran returns India
Saturday, May 23, 2020 - 22:45

రెండు నెలల పాటు దేశం కానీ దేశంలో చిక్కుకున్నాడు ఆ హీరో. ఇండియాలో అడుగు పెట్టగానే క్వారంటైన్ కి పంపించారు. కూతురిని చూడాలంటే మరి కొంత కాలం ఆగాలి.

లాక్ డౌన్ కు ముందు తన కొత్త సినిమా 'ఆడు జీవితం' షూటింగ్ కోసం జోర్డాన్ వెళ్లాడు మలయాళ అగ్ర హీరోల్లో ఒకరైన పృధ్విరాజ్ సుకుమారన్. ఆ దేశంలోని ఎడారిలో షూటింగ్ చేశారు. అదే టైమ్ లో ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభనతో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఇటు ఇండియాలో కూడా విమాన సర్వీసుల్ని ఆపేయడంతో జోర్డాన్ లోనే లాక్ అయిపోయాడు పృధ్విరాజ్.

అలా దాదాపు 2 నెలలుగా జోర్డాన్ లో ఉండిపోయిన పృధ్విరాజ్ ఎట్టకేలకు ఇండియా చేరుకున్నాడు. విదేశాల్లో ఉన్న భారతీయుల్ని స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఏర్పాటుచేయడంతో అందులో ఇండియాకొచ్చాడు.

అయితే ఈ గ్యాప్ ను పృధ్విరాజ్ బాగానే సద్వినియోగం చేసుకున్నాడు. ఎలాగూ ఇండియాకొచ్చే పరిస్థితి లేదని గ్రహించిన ఈ హీరో.. తన యూనిట్ తో కలిసి జోర్డాన్ లోనే అదనంగా మరో షెడ్యూల్ కూడా పూర్తిచేశాడు. జోర్డాన్ లో లాక్ డౌన్ నిబంధనలు పెద్దగా లేవు. అక్కడ కరోనా వ్యాప్తి కూడా తక్కువగా ఉంది. అందుకే అధికారుల అనుమతితో ఎక్స్ ట్రా షెడ్యూల్ కూడా పూర్తిచేశాడు ఈ హీరో. ఇంటికి చేరుకున్న వెంటనే సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయాడు.