మానసిక ప్రశాంతత కోసమే ఇదంతా

Priya Varrier is back to instagram
Wednesday, June 3, 2020 - 14:15

వింక్ సెన్సేషన్ ప్రియా వారియర్ మళ్లీ ఇనస్టాగ్రామ్ లోకి వచ్చింది. లాక్ డౌన్ కు ముందు ఆమె తన ఎకౌంట్ ను డిజేబుల్ చేసింది. దీంతో అప్పట్లో చాలా చర్చ జరిగింది. ఎట్టకేలకు ఆమె మళ్లీ ఇనస్టాగ్రామ్ లోకి రావడంతో పాటు తను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్పుకొచ్చింది.

"నేను బ్రేక్ తీసుకోవడానికి పెద్ద కారణమంటూ ఏమీ లేదు. తీసుకోవాలనుకున్నానంతే. మరీ ముఖ్యంగా మానసిక ప్రశాంతత కోసం బ్రేక్ తీసుకోవాలనుకున్నాను. కొన్ని వారాల పాటు ప్రశాంతంగా, సరదాగా గడిపాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగత విషయం."

ప్రియా వారియర్ ఇనస్టా నుంచి తప్పుకున్న సమయంలో ఆమెపై చాలా ట్రోలింగ్ నడిచింది. కొంతమంది పుకార్లు పుట్టించారు. మరికొంతమంది సెటైర్లు వేశారు. ఇంకొంతమంది ఎగతాళి చేశారు. అవన్నీ తనకు తెలుసని, అయితే పబ్లిసిటీ కోసమే తను ఇనస్టాగ్రామ్ నుంచి తప్పుకున్నానంటూ కొందరు పెట్టిన పోస్టులు మాత్రం తనను బాధించాయని చెప్పుకొచ్చింది.

ఏదేమైనా ప్రియా వారియర్ మళ్లీ వచ్చేసింది. తాజా వీడియోలో ఆమె ఫ్రెష్ గా కనిపించింది. ఇలా కన్నుకొట్టి అలా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ముద్దుగుమ్మ.. రాబోయే రోజుల్లో మరిన్ని అప్ డేట్స్ అందించబోతోంది.