రంజాన్ వంటకాలు చేస్తున్నా: ప్రియమణి

Priyamani talks about her quarantine life
Tuesday, May 12, 2020 - 17:00

టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్ అనే తేడా లేకుండా బిజీగా ఉండే హీరోయిన్ ప్రియమణి. కేవలం సినిమాలే కాదు, ఇప్పుడీమె వెబ్ సిరీస్ లోకి కూడా ఎంటరైంది. దీంతో మరింత బిజీ అయింది. ఈ లాక్ డౌన్ టైమ్ ను రెస్ట్ తీసుకోవడానికి ఉపయోగించుకుంటున్నానంటోంది ప్రియమణి.

1. ఎలా ఉంది లాక్ డౌన్?
సినిమాలు ఉన్నప్పుడు ఒక సెట్ నుంచి ఇంకో సెట్ కు షిఫ్ట్ అయ్యేదాన్ని. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఇంట్లో ఒక గది నుంచి మరో గదికి మారడానికే టైమ్ సరిపోతోంది. (నవ్వులు). కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత సినిమాకు ఇన్నాళ్లు ఎప్పుడూ దూరం అవ్వలేదు. ఇంత గ్యాప్ నాకు ఎప్పుడూ రాలేదు.

2. నిజమా.. ఇంత గ్యాప్ ఎప్పుడూ రాలేదా?
2002లో కెరీర్ స్టార్ట్ చేశాడు. ప్రారంభంలో ఓ సారి 11 నెలల గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ గ్యాప్ రాలేదు. ఇదిగో ఇప్పుడిగా కరోనా వల్ల లాంగ్ గ్యాప్ వచ్చింది. ఇది కూడా ఒకందుకు మంచిదే. ఫ్యామిలీతో గడుపుతున్నాను. కానీ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్దామా అని ఉంది.

3. ఈ టైమ్ లో ప్రత్యేకంగా ఏమైనా చేస్తున్నారా?
ఈ లాక్ డౌన్ టైమ్ లో అందర్లానే నేను కూడా గడిపేస్తున్నాను. ఇంటి పనులన్నీ చేస్తున్నాను. చాలా వెబ్ సిరీస్ లు, సినిమాలు చూస్తున్నాను. అంతేకాదు, నిత్యావసర సరుకుల కోసం బయటకు కూడా నేనే వెళ్తున్నాను.
Priyamani

4. ముస్తాఫాతో లైఫ్ ఎలా ఉంది?
పెళ్లయిన తర్వాత నా భర్త ముస్తఫాతో ఇన్నాళ్లు కలిసి ఉండడం ఇదే ఫస్ట్ టైమ్. లాక్ డౌన్ తో అది నెరవేరింది. పైగా ఇది రంజాన్ మాసం. ముస్తాఫా, మామగారు ఉపవాసం ఉంటారు. నేను, అత్తగారు ఫాస్టింగ్ చేయడం లేదు. సాయంత్రం అయ్యేసరికి వాళ్ల నమాజ్ కు, ఆ తర్వాత డిన్నర్ కు అన్నీ నేనే సిద్ధం చేస్తాను. వాళ్లు అలా వచ్చి కూర్చుంటారంతే. ఇలా ప్రతి నిమిషం ఎంజాయ్ చేస్తున్నాను.

5. ఈ లాక్ డౌన్ టైమ్ లో మీరెందుకు ఆన్ లైన్ లైవ్స్ లోకి రాలేదు?
ఇలాంటి టైమ్ లో సోషల్ మీడియా చాలా హెల్ప్ చేస్తోంది. మనకు మనం ప్రమోషన్ ఇచ్చుకోవడానికి సోషల్ మీడియా చాలా బాగుంటుంది. కానీ నేను మాత్రం దూరంగా ఉండడానికే నిర్ణయించుకున్నాను. చాలామంది లైవ్ లోకి రమ్మని అడిగారు. నేను మాత్రం గ్యాప్ తీసుకుంటానని చెప్పాను. ఎప్పట్నుంచో బ్రేక్ కోసం చూస్తున్నాను. అదిలా దొరికింది.