ఫ్లాప్ భామకు నితిన్ ఛాన్స్

Priyanka Arul Mohan opposite Nithin
Saturday, April 25, 2020 - 18:00

ఎవరైనా తమ సినిమాలో హిట్ హీరోయిన్ ను పెట్టుకోవాలని చూస్తారు. ఒకప్పుడు సమంత కోసం హీరోలు వెంటపడినా, ఇప్పుడు రష్మిక, పూజా హెగ్డే  కాల్షీట్ల కోసం ఎగబడినా కారణం ఇదే. హిట్ హీరోయిన్లు సినిమాలో ఉంటే ప్రాజెక్టుకు క్రేజ్ వస్తుంది. సెంటిమెంట్ యాంగిల్ కూడా కలిసొస్తుంది. ఇవన్నీ తెలిసి కూడా ఓ ఫ్లాప్ హీరోయిన్ కు అవకాశం ఇచ్చాడు నితిన్.

సొంత బ్యానర్ పై ఈమధ్య ఓ సినిమా లాంఛ్ చేశాడు నితిన్. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకుడు. బాలీవుడ్ లో హిట్టయిన అంథాధున్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ ను తీసుకున్నారు. గ్యాంగ్ లీడర్ లాంటి ఫ్లాప్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.

అంథాధున్ హిందీలో రాధిక ఆప్టే హీరోయిన్ గా నటించింది. సినిమాలో ఆమెతో ఓ మాంఛి సెక్సీ సీన్ కూడా ఉంది. మరి రాధికలా హాట్ గా నటించేందుకు ప్రియాంక మోహన్ ఒప్పుకుందని నితిన్ తీసుకున్నాడా.. లేక తక్కువ రెమ్యూనరేషన్ కు (సొంత బ్యానర్ కాబట్టి) వచ్చిందని తీసుకున్నాడో అతడికే తెలియాలి. ఒకటి మాత్రం నిజం. అంథాధున్ లో హీరోయిన్ కు కాస్త స్కోప్ తక్కువే.