మందు కొట్టి నటించిన హీరోయిన్

Priyanka Jawalkar talks about drunk act
Thursday, November 15, 2018 - 19:45

మొదటి సినిమాకే మందు కొట్టి నటించిందట హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. ఇది గాసిప్ కాదు. స్వయంగా తను బయటపెట్టిన నిజం. "టాక్సీవాలా" ప్రమోషన్స్ లో భాగంగా ఈ గమ్మత్తయిన విషయాన్ని ఆడియన్స్ తో పంచుకుంది ప్రియాంక.

"చాలా టేక్స్ చేశాను కానీ సీన్ పండడం లేదు. ఎందుకంటే పబ్ లో తాగి క్యాబ్ బుక్ చేసే సీన్ అది. తర్వాత అదే సీన్ హీరోతో కూడా కంటిన్యూ అవుతుంది. ఇక చేసేదేం లేక తాగుతానని చెప్పాను. మొదట మేకర్స్ ఒప్పుకోలేదు. తర్వాత వాళ్లే లైట్ గా వోడ్కా ఇచ్చారు. అది తాగిన తర్వాత కాస్త మత్తు అనిపించింది. వెంటనే షాట్ ఓకే అయిపోయింది."

ఇలా తను తాగి నటించిన తొలి సన్నివేశం వివరాల్ని బయటపెట్టింది ప్రియాంక జవాల్కర్. ఈ సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది.

"టాక్సీవాలా" సినిమా దాదాపు రెండేళ్ల కిందటి ప్రాజెక్టు. అప్పట్నుంచి ప్రియాంక మరో సినిమా ఒప్పుకోలేదు." టాక్సీవాలా" థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రమే మరో సినిమాకు కమిట్ అవుతానంటోంది ఈ రాయలసీమ పిల్ల.