నిర్మాతలు టెంప్ట్... వద్దంటున్న హీరోలు

Producers are tempted by OTT offers but heroes refuse
Saturday, April 11, 2020 - 15:30

ఈ లాక్ డౌన్ వల్ల సినిమాలను ఎప్పుడు విడుదల చేసుకోగలమో అన్న టెన్షన్ పడింది నిర్మాతలకి. ఎడారిలో ఒయాసిస్ లా నిర్మాతలకు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి డిజిటల్ సంస్థలు కనిపిస్తున్నాయి. సినిమా థియేటర్లో రిలీజ్ చేయకుండా మా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లలో రిలీజ్ చేస్తే ఇంత మొత్తం ఇష్టము అంటూ అవి ఆఫర్లు ప్రకటించాయి.

ఒరేయ్ బుజ్జిగా, రెడ్, వి, నిశ్శబ్దం... ఇలా రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమాలకు ఆఫర్లు ఇవ్వడంతో నిర్మాతలు టెంప్ట్ అవుతున్నారు. కానీ హీరోలు మాత్రం ససేమిరా అంటున్నారు. ఎందుకంటే... సినిమాని థియేటర్లో రిలీజ్ చెయ్యకపోతే... ఫ్యూచర్ లో తమ ఓవరాల్ మార్కెట్  దెబ్బతింటుంది అనేది వారి భయం. అలాగే ఇమేజ్ కి కూడా డామేజ్. అందుకే నిర్మాతలు టెంప్ట్ అవుతున్నా.... హీరోలు వద్దు అంటున్నారు.

ఐతే ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి.... "ఒరేయ్ బుజ్జిగా" వంటి సినిమాలకు ఈ అఫర్ సూట్ అవుతుంది కానీ "వి", "రెడ్" వంటి వాటికి కరెక్ట్ కాదు.