ఫండ్స్ లేవు కానీ సినిమాలు తీస్తాడట

Producer's different proposal to streaming company
Thursday, July 16, 2020 - 12:30

ఈ మధ్య అందరి జపం... ఓటిటి మంత్రం. నెట్ ఫ్లిక్స్, అమెజాన్, హాట్ స్టార్ లకు సినిమాలు తీస్తాము. తీసిన సినిమాలు వాళ్ళు కొనకపోతే అహా కైనా అంటగడుతామనుకునే బ్యాచ్ టాలీవుడ్ లో మొదలైంది. ఆ రేస్ లో మనం వెనుకబడుతున్నాం అనుకోని కాబోలు...ఒక యువ నిర్మాత (పెద్ద సినిమాలు తీసి చేతులు కాల్చుకున్న వ్యక్తి) ఇప్పుడు చిన్న సినిమాలు తీస్తాను అంటూ రోజుకో వార్తని లీక్ చేస్తున్నాడు. నిజంగా ఇవన్నీ అవుతాయా అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.

మూడు, నాలుగు కథలు, కాంబినేషన్లు రెడీ చేశాము.... మీరు డబ్బులు ఇస్తే...వెంటనే ప్రొడ్యూస్ చేసి మీకు ఇష్టము అంటూ సదరు నిర్మాత డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీలకు ప్రపోజల్ పెట్టాడంట. అంటే.. ఆయన దగ్గర ఫండ్స్ లేవు... డిజిటల్ కంపెనీస్ డబ్బులు ఇస్తే వాళ్ళకి తీసి పెడుతాడట.

ఇప్పుడు మీడియాలో లీక్ చేయించుకుంటున్న వార్తల్లో సగం ఈ బాపతే... మీడియాలో కాంబినేషన్స్ చూసి ఫండ్స్ ఎవరైనా ఇస్తారేమో అని కొందరి నిర్మాతల ఐడియా. 

|

Error

The website encountered an unexpected error. Please try again later.