భారతీయుడు 2 అటకెక్కనుందా?

గత నెలలో అట్టహాసంగా "భారతీయుడు 2" సినిమాని ప్రారంభించాడు దర్శకుడు శంకర్. కమల్‌హాసన్ సేనాపతి పాత్రలో "భారతీయుడు 2" షురూ అయింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్. షూటింగ్ మొదలైన నెల రోజుల తర్వాత సినిమా సమస్యల్లో పడింది. దర్శకుడు శంకర్ ఎప్పటిలాగే చెప్పిన దానికన్నా బడ్జెట్‌ని పెంచడం మొదలుపెట్టాడు. మొదటి షెడ్యూల్‌లోనే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంట్రోల్ తప్పడంతో నిర్మాణ సంస్థ లైకా లైన్లోకి వచ్చి ..సినిమాని తన కంట్రోల్‌లోకి తీసుకొంది. షూటింగ్‌ని తాత్కాలికంగా నిలిపివేసింది.
ఇపుడు కూచొని మాట్లాడుకుందాం.. ఆ తర్వాతే సినిమాని కొనసాగించాలా వద్దా అని డిసైడ్ చేద్దామని లైకా సంస్థ అధినేతలు శంకర్‌కి చెప్పారట. సినిమాకి టోటల్‌గా ఎంత బడ్జెట్ కావాలి, ఎన్ని రోజుల్లో తీస్తారు. ఫస్ట్‌కాఫీని ఎపుడు ఇస్తారు ఇవన్నీ రాతపూర్వకంగా ఒప్పందాలు చేసుకుందాం అని లైకా వారు షరతు పెట్టారట ఇపుడు. శంకర్ తనకిష్టమొచ్చినట్లు బడ్జెట్ పెంచుకుంటూ పోవడం, చెప్పిన డేట్‌కి తీయకపోవడంతో లైకా సంస్థ "2.0" సినిమాలో వంద కోట్ల రూపాయలు నష్టపోయింది.
ఇపుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అవబోతుందని గ్రహించింది. అందుకే కమల్‌కే మార్కెట్‌లేదు..పైగా ఇపుడు మీరు ఇష్టమొచ్చినట్లు బడ్జెట్ పెంచుతామంటే కుదరదని సినిమాని ఆపేసిందట. మళ్లీ సినిమా సెట్‌కి వెళ్లాలంటే..శంకర్ రాజీపడాలి లేదా వేరే నిర్మాతలతో అయినా ముందుకెళ్లాలి. నెక్స్ట్ ఏంటో!
- Log in to post comments