హర్ట్ అయిన బిగ్ బాస్ బ్యూటీ

Punarnavi Bhupalam deletes posts about Delhi boys
Friday, May 8, 2020 - 10:15

బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి హర్ట్ అయింది. ఎంతలా అంటే ఏకంగా ఆమె ఇనస్టాగ్రామ్ నుంచి తప్పుకుంది. కొన్నాళ్ల పాటు ఈ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ కు దూరంగా ఉంటానని స్పష్టంచేసింది పునర్నవి. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఢిల్లీలో బాయ్స్ లాకర్ రూమ్ వ్యవహారం బయటపడిన సంగతి తెలిసిందే. ఇనస్టాగ్రామ్ లో ఈ ఎకౌంట్ తెరిచిన కొంతమంది విద్యార్థులు.. అశ్లీలంగా మాట్లాడుకునే స్క్రీన్ షాట్స్ బయటకు వచ్చాయి. గ్రూప్ సెక్స్ ఎలా చేయాలి, సామూహిక అత్యాచారం ఎలా చేయాలనే టాపిక్స్ పై కూడా ఇందులో చర్చించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. కొంతమంది పిల్లల్ని అరెస్ట్ కూడా చేశారు.

ఈ మొత్తం వ్యవహారంపై పునర్నవి స్పందించింది. పిల్లల్ని తల్లిదండ్రులు సరిగ్గా పెంచాలంటూ తనదైన శైలిలో పోస్ట్ పెట్టింది. దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రతి విషయాన్ని తల్లిదండ్రులు కంట్రోల్ చేయలేరని, ఊరికే పేరెంట్స్ ను నిందించడం సరికాదని క్లాస్ పీకారు. అంతేకాదు.. మీరు పెట్టిన పోస్ట్ వల్ల ఆ పిల్లల తల్లిదండ్రుల పరువు పోతోందంటూ కాస్త ఘాటుగానే మరో వ్యక్తి రిప్లయ్ ఇచ్చాడు.

దీంతో పునర్నవి హర్ట్ అయింది. ఇనస్టాగ్రామ్ అనేది ఒక్కోసారి విషపూరిత సాధనంగా కూడా మారిపోతోందని.. ప్రస్తుతం తను దీంతో విసిగిపోయానని, కోలుకోవడానికి కొన్నాళ్లు పడుతుందనే అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత బాయ్స్ లాకర్ రూమ్ కు సంబంధించి తన వాల్ ఉన్న సమాచారం, డిస్కషన్, పోస్టులు అన్నీ డిలీట్ చేసింది.

వైజాగ్ గ్యాస్ లీక్ బాధితులు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నానంటూ పోస్ట్ పెట్టిన పునర్నవి.. ఆ తర్వాత సైలెంట్ అయింది. ఆమె మళ్లీ వెంటనే ఇనస్టాలోకి వస్తుందా లేక నిజంగానే గ్యాప్ తీసుకుంటుందా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.