గరువు వర్మ బాటలో శిష్యుడు పూరి

Puri following his guru RGV?
Saturday, December 23, 2017 - 20:15

ఆర్జీవీ సంగతి అందరికీ తెలిసిందే. సినిమాలు తక్కువ, షార్ట్ ఫిలిమ్స్ ఎక్కువ. ఇప్పుడీ రూట్లోకి పూరి జగన్నాథ్ కూడా చేరాడు. తను కూడా ఓ షార్ట్ ఫిలిం తీశానని ప్రకటించాడు. డిసెంబర్ 31న ఉదయం 10 గంటలకు తన మొట్టమొదటి షార్ట్ ఫిలిం అప్ లోడ్ అవుతుందని ప్రకటించాడు. తన మొదటి లఘుచిత్రానికి హగ్ (కౌగిలింత) అనే టైటిల్ పెట్టాడు పూరి జగన్నాధ్.

షార్ట్ ఫిలిమ్స్ తీయడంలో కేవలం వర్మను ఫాలో అవ్వడమే కాదు.. సంచలనం సృష్టించడంలో, కంటెంట్ తీసుకోవడంలో కూడా గురువుని ఫాలో అయిపోతున్నాడు ఈ శిష్యుడు. షార్ట్ ఫిలిం ఫస్ట్ లుక్ లో భాగంగా నగ్నంగా ఉన్న ఓ మహిళ, చెట్టును వాటేసుకునే స్టిల్ ను విడుదల చేశాడు. ఆమెను వెనక నుంచి చూపించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.

హగ్ అనే షార్ట్ ఫిలింతో పూరి ఏం చెప్పదలచుకున్నాడనే విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కానీ అతడు రిలీజ్ చేసిన పోస్టర్ పై మాత్రం సోషల్ మీడియాలో అప్పుడే దుమారం చెలరేగింది. బాగుందని మెచ్చుకునేవాళ్లు కొందరుంటే.. పూరి ఎందుకిలా మారిపోయావ్ అనేవాళ్లు ఎక్కువమంది ఉన్నారు.