ఇది నిజమేనా పుష్ప?

Pushpa villain to be changed?
Tuesday, April 14, 2020 - 15:30

"పుష్ప" సినిమాకి కష్టాలు ఆగట్లేదు. మార్చి నెల నుంచి అల్లు అర్జున్ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొందామని అనుకున్నాడు. సరిగ్గా అదే టైంలో లాక్డౌన్ మొదలైంది. ఈ లాక్డౌన్ లాక్ ఎప్పుడు ఓపెన్ అవుద్దో ఎవరికీ తెలియట్లేదు. జూన్ వస్తే కానీ షూటింగులు షురూ కావని అనేది ఒక మాట. అన్ని ఒకేసారి సినిమాలు మొదలైతే ... కాల్షీట్ల సమస్య వస్తుంది. అదే జరుగుతోందిపుడు. 

ఈ సినిమాలో విలనుగా నటించాల్సిన తమిళ్ హీరో విజయ్ సేతుపతి ఇప్పుడు తప్పుకున్నాడట. లాక్డౌన్ తర్వాత తన తమిళ్ సినిమాలు ముఖ్యమని ఈ మూవీకి జెల్ల కొట్టాడంట. అంతే మరి, ఇక్కడ విలన్ వేషాల కోసం షెడ్యూల్స్ మార్చుకుంటా పొతే... అక్కడ హీరో వేషాలు మొత్తం పోతాయి. అందుకే ... వేరే నటుడిని చూసుకోమని సుకుమార్ కి చల్లగా చెప్పేశాడట. సో.. సుకుమార్ వేట ఫస్ట్ కే వచ్చిందా?

"పుష్ప" సినిమా ... ఆంధ్ర, తమిళనాడు బార్డర్ లో జరిగే కథ. ఎర్ర చందనపు స్మగ్లింగ్ నేపథ్యంగా తీస్తున్న ఈ సినిమాలో కథ ప్రకారం తమిళ విలన్ కావాలి.