ఇంకో రీమేక్ చేస్తున్న పీవీపీ

PVP bags remake rights of O My Kaduvale
Saturday, February 8, 2020 - 12:30

ఎవ‌రు, ఊపిరి వంటి రీమేక్ చిత్రాల‌తోనూ నిర్మాత‌గా సూప‌ర్‌హిట్స్ అందుకున్నారు పివిపి సినిమా అధినేత ప్ర‌సాద్ వి.పొట్లూరి.  బలుపు, ఘాజి, మహర్షి వంటి భారీ బ‌డ్జెట్ చిత్రాల‌నే కాదు.. రీమేక్ చిత్రాల‌ను కూడా అందిస్తున్న పివిపి సినిమా ఇప్పుడు త‌మిళ చిత్రం "ఓ మై క‌డ‌వులే" సినిమా రీమేక్ హ‌క్కుల‌ను ద‌క్కించుకుంది. 

 త‌మిళంలో అశోక్ సెల్వ‌న్‌, రితికా సింగ్‌, వాణీ బోజ‌న్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రంలో విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌లో మెప్పించారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు రీమేక్ హ‌క్కులు ద‌క్కించుకున్నాం, త్వ‌ర‌లోనే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని పీవీపీ సంస్థ ప్రకటించింది. 

కొంత గ్యాప్ తర్వాత పీవీపి ...మళ్ళీ సినిమా నిర్మాణంపై దృష్టి పెట్టాడట.