మొత్తానికి సాధించిన పీవీపీ

PVP to contest from Vijayawada Loksabha seat
Sunday, March 17, 2019 - 12:15

నిర్మాత పీవీపీ క‌ల నెర‌వేరిన‌ట్లే. విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేయాల‌నేది ఆయ‌న డ్రీమ్‌. 2014 ఎన్నిక‌ల్లోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ ద్వారా టీడీపీ సీటును పొందాల‌ని ప్ర‌య‌త్నించారు. దాదాపు సీట్ క‌న్‌ఫ‌మ్ అయింద‌నుకున్న టైమ్‌లో రాజ‌కీయం ర‌స‌కందాయంగా మారి పీవీపీకి సీటు ద‌క్క‌లేదు.

విజ‌య‌వాడ‌లో పుట్టి పెరిగిన పీవీపీ త‌న సొంత నియోజకవ‌ర్గం నుంచి పోటీ చేసి గెల‌వాల‌నేది డ్రీమ్‌. ఇటీవ‌లే వైఎస్సార్సీ పార్టీలో చేరారు ఆయ‌న‌. వెంట‌నే విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పీవీపీని వైఎస్సార్సీ నిలిపింది. ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమాకి ఒక నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న పీవీపీ...ఇక త‌న మ‌కాంని కొద్ది రోజుల పాటు విజ‌య‌వాడికి మార్చ‌నున్నారు. 

తెలుగుదేశం చాలా స్ట్రాంగ్‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం ఇది. ఐనా గెలుస్తాన‌ని ధీమాగా ఉన్నారు పీవీపీ. అపుడే ఆయ‌న టీమ్ వ‌ర్క్ మొదలుపెట్టింది. ఇక పీవీపీ రేప‌ట్నుంచి ప్ర‌చారం మొద‌లుపెడుతారు.